టీవీవీపీ పరిఽధిలోకి టీ-డయాగ్నస్టిక్‌ సెంటర్‌

ABN , First Publish Date - 2021-12-22T05:26:22+05:30 IST

సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలోని తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ (హబ్‌) పర్యవేక్షణ, బాధ్యతలను ఇక నుంచి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నిర్వర్తించనున్నారు.

టీవీవీపీ పరిఽధిలోకి టీ-డయాగ్నస్టిక్‌ సెంటర్‌

జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సంగారెడ్డి

సంగారెడ్డి అర్బన్‌, డిసెంబరు 21 : సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలోని తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ (హబ్‌) పర్యవేక్షణ, బాధ్యతలను ఇక నుంచి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నిర్వర్తించనున్నారు. ఇదివరకు వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేసిన టీ-డయాగ్నస్టిక్‌ సెంటర్‌ను తాజాగా తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిధికి బదిలీ చేశారు. దీంతో హబ్‌ నిర్వహణ, బాధ్యతలను జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ చూసుకోనున్నారు. కాగా మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ నుంచి హబ్‌ను జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంగారెడ్డి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం టీ-డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో పనిచేసే వైద్య సిబ్బందితో పాటు జిల్లాలోని అన్ని టీవీవీపీ ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో రోగ నిర్ధారణ పరీక్షల ఫలితాలను వెల్లడించేందుకు 24 గంటలు పనిచేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని, ల్యాబ్‌ టెక్నీషియన్లు 24 గంటలు పనిచేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైద్యులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-22T05:26:22+05:30 IST