‘యాదాద్రి పోలీసులపై చర్యలు తీసుకోండి’

ABN , First Publish Date - 2021-10-20T04:24:33+05:30 IST

దివ్యాంగుడి మృతికి కారణమైన యాదగిరి గుట్ట పోలీసులపై చర్యలు తీసుకోవాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడు నర్సింహులు, అధ్యక్షుడు గోపాల్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి బస్వరాజ్‌ మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

‘యాదాద్రి పోలీసులపై చర్యలు తీసుకోండి’

సంగారెడ్డి రూరల్‌, అక్టోబరు 19: దివ్యాంగుడి మృతికి కారణమైన యాదగిరి గుట్ట పోలీసులపై చర్యలు తీసుకోవాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడు నర్సింహులు, అధ్యక్షుడు గోపాల్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి బస్వరాజ్‌ మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో డిమాండ్‌ చేశారు. యాదగిరి గుట్టకు దర్శనార్థం వెళ్లిన కార్తీక్‌గౌడ్‌పై బందోబస్తులో ఉన్న పోలీసులు అకారణంగా దాడి చేశారన్నారు. పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక కార్తీక్‌గౌడ్‌ మృతి చెందాడని, దివ్యాంగుడి మృతికి కారణమైన పోలీసులను సస్పెండ్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-10-20T04:24:33+05:30 IST