ఆడపిల్లలకు భరోసా ‘సుకన్య సమృద్ధి యోజన’

ABN , First Publish Date - 2021-03-07T04:53:29+05:30 IST

గ్రామంలో జన్మించిన ప్రతీ ఆడపిల్లలకు భరోసా కల్పించడం కోసం సుకన్య సమృద్ధి యోజనలో చేర్చడానికి సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఎద్దుమైలారం పంచాయతీ ఆధ్వర్యంలో కార్యచరణ రూపొందించారు.

ఆడపిల్లలకు భరోసా ‘సుకన్య సమృద్ధి యోజన’
కంది మండలంలోని ఎద్దుమైలారం గ్రామం

- నేడు ఎద్దుమైలారంలో 54 మంది ఆడపిల్లలకు కానుక

- తొలి రెండు వాయిదాలు చెల్లించనున్న పంచాయతీ పాలకవర్గం

కంది, మార్చి 6 : గ్రామంలో జన్మించిన ప్రతీ ఆడపిల్లలకు భరోసా కల్పించడం కోసం సుకన్య సమృద్ధి యోజనలో చేర్చడానికి సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఎద్దుమైలారం పంచాయతీ ఆధ్వర్యంలో కార్యచరణ రూపొందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 54 మంది ఆడపిల్ల తల్లిదండ్రులను సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేర్చుతూ, తొలి రెండు వాయిదాల మొత్తం రూ. రూ. వెయ్యి పంచాయతీ నుంచి చెల్లించనున్నారు. మిగిలిన వాయిదాలు చెల్లించేందుకు తల్లిదండ్రులకు ఆర్థిక స్వాలంభనకు వివిధ పథకాల కింద సాయం చేయనున్నారు. ఇందుకోసం అవసరమైతే దాతల సాయం తీసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంలో భాగంగా పోస్టాఫీసులో నెలకు రూ. 500 చెల్లిస్తే 15 సంవత్సరాల అనంతరం రూ. 3 లక్షలు అందుతాయి. ఈ విషయమై సర్పంచ్‌ మాట్లాడుతూ తమ గ్రామంలోని ఆడపిల్లలున్న తల్లిదండ్రులు గర్వించేలా సుకన్య సమృద్ధి యోజన ద్వారా భరోసా కల్పిస్తామన్నారు. 

Updated Date - 2021-03-07T04:53:29+05:30 IST