పరిశ్రమల స్థాపనకు అనువైన స్థలాలను గుర్తించాం

ABN , First Publish Date - 2021-07-13T04:59:36+05:30 IST

సిద్దిపేట జిల్లాలో ఔటర్‌రింగ్‌రోడ్డు బయట ఆరెంజీ కేటగిరిలో పరిశ్రమల స్థాపనకు అనువైన స్థలాలను గుర్తించామని కలెక్టర్‌ పి.వెంకట్రామారెడ్డి రాష్ట్ర పరిశ్రమలశాఖముఖ్యకార్యదర్శి జయే్‌షరంజన్‌కు తెలిపారు.

పరిశ్రమల స్థాపనకు అనువైన స్థలాలను గుర్తించాం

సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి


సిద్దిపేటసిటీ, జూలై 12: సిద్దిపేట జిల్లాలో ఔటర్‌రింగ్‌రోడ్డు బయట ఆరెంజీ కేటగిరిలో పరిశ్రమల స్థాపనకు అనువైన స్థలాలను గుర్తించామని కలెక్టర్‌ పి.వెంకట్రామారెడ్డి రాష్ట్ర పరిశ్రమలశాఖముఖ్యకార్యదర్శి జయే్‌షరంజన్‌కు తెలిపారు.  హైదరాబాద్‌లోని కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్‌రింగ్‌రోడ్డు అవతలికి తరలించేందుకు అవసరమైన స్థలాల గుర్తింపు, భూ సేకరణపై రాజధాని పరిసర జిల్లాల కలెక్టర్లతో సోమవారం రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్‌ వీడియోకాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సమావేశానికి హాజరైన కలెక్టర్‌ సిద్దిపేట జిల్లాలో పరిశ్రమల స్థాపనకు స్థలాల గుర్తింపు ప్రగతిని వివరించారు. ములుగు మండలం కొత్తూరులో 236 ఎకరాలను, అచ్చాయిపల్లిలో 80 ఎకరాల స్థలాన్ని పరిశ్రమల స్థాపనకు అనువైనదిగా గుర్తించామన్నారు. భూ సేకరణకు అవసరమైన డబ్బును టీఎ్‌సఐఐసీ ద్వారా డిపాజిట్‌ చేస్తే పక్షం రోజుల్లో భూసేకరణ పూర్తిచేస్తామని జయే్‌షరంజన్‌కు నివేదించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ గణే్‌షరామ్‌, టీఎ్‌సఐఐసీ సిద్దిపేట జిల్లా జోనల్‌ మేనేజర్‌ శివప్రసాద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-13T04:59:36+05:30 IST