కుటుంబ కలహాలతో ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-01-01T04:20:58+05:30 IST
కుటుంబ కలహాలతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మిరుదొడ్డి మండలం ఖాజీపూర్ గ్రామంలో గురువారం రాత్రి జరిగింది.

మిరుదొడ్డి, డిసెంబరు 31: కుటుంబ కలహాలతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మిరుదొడ్డి మండలం ఖాజీపూర్ గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. భూంపల్లి ఎస్‌ఐ సర్దార్ జమాల్ తెలిపిన వివరాల ప్రకారం.. మిరుదొడ్డి మండల ఖాజీపూర్‌కు చెందిన మల్లేశం(45)కు ఇద్దరు భార్యలు. ఇద్దరు భార్యలు తరచూ గొడవ పడుతుండడంతో మల్లేశం మానసిక వేదనకు గురయ్యాడు. దీంతో గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ఇద్దరు భార్యలతో పాటు ముగ్గురు పిల్లలున్నారు.