కుటుంబకలహాలతో ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-11-06T05:14:02+05:30 IST
కుటుంబ కలహాలతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం మిరుదొడ్డి మండలం ఖాజీపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

మిరుదొడ్డి, నవంబరు 5: కుటుంబ కలహాలతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం మిరుదొడ్డి మండలం ఖాజీపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. భూంపల్లి ఎస్‌ఐ సర్థార్‌జమాల్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎండీ సాజిత్(25) మద్యానికి బానిసగా మారడంతో ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. కుటుంబసభ్యులు ఎన్నిసార్లు చెప్పినా సాజిత్ మారకపోవడంతో భార్య తల్లిగారిల్లైన చేగుంటకు వెళ్లిపోయింది. మనస్థానం చెందిన సాజిత్ శుక్రవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ తెలిపారు. కాగా సాజిత్‌కు భార్య, 40రోజుల కూతురు ఉంది.