సిద్దిపేట ప్రత్యేక ఆకర్షణగా సుడా పార్కు

ABN , First Publish Date - 2021-12-16T04:26:57+05:30 IST

సుడా పరిధిలోని సిద్దిపేట-కరీంనగర్‌ రోడ్‌ ఎస్‌కే జంక్షన్‌లో హ్యాండ్‌ వాటర్‌ ఫౌంటెయిన్‌, బట్టర్‌ఫ్లై పక్షులు, ఆకర్షించి ఆకట్టుకునేలా.. పలు శిల్పాలు, కనువిందు చేసేలా పచ్చని చెట్లు, పచ్చిక బయళ్లు, గ్రీన్‌ లాన్‌.., రాత్రిపూట వెలుగులు విరజిమ్మే ఆకర్షణీయమైన విద్యుత్‌ కాంతులతో సుడా పార్కు సిద్దిపేటకు కొత్త అందాన్ని తెచ్చిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

సిద్దిపేట ప్రత్యేక ఆకర్షణగా సుడా పార్కు
విద్యుత్‌ కాంతులతో మెరుస్తున్న శిల్పాన్ని పరిశీలిస్తున్న మంత్రి

ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట అగ్రికల్చర్‌, డిసెంబరు 15: సుడా పరిధిలోని సిద్దిపేట-కరీంనగర్‌ రోడ్‌ ఎస్‌కే జంక్షన్‌లో హ్యాండ్‌ వాటర్‌ ఫౌంటెయిన్‌, బట్టర్‌ఫ్లై పక్షులు, ఆకర్షించి ఆకట్టుకునేలా.. పలు శిల్పాలు, కనువిందు చేసేలా పచ్చని చెట్లు, పచ్చిక బయళ్లు, గ్రీన్‌ లాన్‌.., రాత్రిపూట వెలుగులు విరజిమ్మే ఆకర్షణీయమైన విద్యుత్‌ కాంతులతో సుడా పార్కు సిద్దిపేటకు కొత్త అందాన్ని తెచ్చిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రమైన సిద్దిపేట-కరీంనగర్‌ రోడ్‌ జంక్షన్‌లో రూ.25 లక్షలతో ఏర్పాటైన సుడా హరిత పార్కు, అంతకు ముందు రూ.4 లక్షలతో హైమస్ట్‌ విద్యుత్‌ దీపాలను మంత్రి  ప్రారంభించారు. కాగా రెండో ఫేజ్‌ నెక్లెస్‌ రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బుధవారం సాయంత్రం ముందుగా నైట్‌ గార్డెన్‌ను వీక్షించి అక్కడికి వచ్చిన ప్రజలతో ముచ్చటించారు. రెండో ఫేజ్‌ పనులపై ఆరా తీస్తూ.. టార్చ్‌లైట్‌ బ్యాటరీ పట్టి కొత్తగా రూపుదిద్దుకోనున్న నెక్లెస్‌ రోడ్‌ వెంట చివరి వరకూ కాలినడకన వెళ్లారు. మున్సిపల్‌, టూరిజం అధికారులు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజనర్సు సమన్వయంతో పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి వేగంగా పూర్తి చేయాలని సూచించారు. మంత్రి వెంట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.



Updated Date - 2021-12-16T04:26:57+05:30 IST