ఉపసర్పంచ్ చెక్ పవర్ రద్దు.. కార్యదర్శి సస్పెన్షన్
ABN , First Publish Date - 2021-02-26T05:27:05+05:30 IST
అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న ఉపసర్పంచ్, విధుల్లో నిర్లక్ష్యం వహించిన గ్రామ పంచాయతీ కార్యదర్శిపై వేటు వేస్తూ కలెక్టర్ హన్మంతరావు గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్
సంగారెడ్డి రూరల్, ఫిబ్రవరి 25 : అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న ఉపసర్పంచ్, విధుల్లో నిర్లక్ష్యం వహించిన గ్రామ పంచాయతీ కార్యదర్శిపై వేటు వేస్తూ కలెక్టర్ హన్మంతరావు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. కంగ్టి మండలం బాబుల్గావ్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ దత్తురావు.. సీసీ చార్జెస్ ట్రాక్టర్ వాయిదా, మల్టీపర్పస్ వర్కర్స్ జీతాలు, గ్రామపంచాయతీ అభివృద్ధికి సంబంధించిన చెక్కులపై సంతకాలు చేసేందుకు నిరాకరించారు. దీంతో ఉపసర్పంచ్ చెక్ పవర్‌ను రద్దు చేయడమే కాకుండా.. మూడునెలల పాటు విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. కంగ్టి మండల పంచాయతీ అధికారికి చెక్కుపై ఉమ్మడి సంతకం పెట్టేందుకు ఆదేశించారు. అదేవిధంగా అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామపంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ అక్రమ కట్టడాలను ప్రోత్సహించినందుకు కార్యదర్శి సుధీర్‌రెడ్డిని విధుల నుంచి తొలగించి, సర్పంచ్ ఏర్పుల కృష్ణకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.