బాలలను హింసిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-12-31T05:04:58+05:30 IST

బాలలను హింసించినా, వారి హక్కులను కాలరాసినా కఠిన చర్యలకు బాధ్యులవుతారని ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి హెచ్చరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్‌.ఆశాలత ఆధ్వర్యంలో వర్చువల్‌ పద్ధతిన జువెనైల్‌ చట్టంపై పోలీసు అధికారులు, బాల సంరక్షణ శాఖ అధికారులు, శిశుగృహసిబ్బందికి అవగాహన కల్పించారు.

బాలలను హింసిస్తే కఠిన చర్యలు
బాలసదనంలోని పిల్లలతో మాట్లాడుతున్న న్యాయమూర్తి పాపిరెడ్డి

ఉమ్మడి మెదక్‌ జిల్లా న్యాయమూర్తి పాపిరెడ్డి


సంగారెడ్డి క్రైం, డిసెంబరు 30 : బాలలను హింసించినా, వారి హక్కులను కాలరాసినా కఠిన చర్యలకు బాధ్యులవుతారని ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి హెచ్చరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్‌.ఆశాలత ఆధ్వర్యంలో వర్చువల్‌ పద్ధతిన జువెనైల్‌ చట్టంపై పోలీసు అధికారులు, బాల సంరక్షణ శాఖ అధికారులు, శిశుగృహసిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల సంక్షేమం కోసం అందరూ కృషి చేయాలని కోరారు. బాలల హక్కులను కాపాడటానికి న్యాయ వ్యవస్థ తరఫున పూర్తిసహాయసహకారాలుంటాయని అన్నారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్‌.ఆశాలత, స్పెషల్‌ ఎక్సైజ్‌ కోర్టు జడ్జి జె.హన్మంతరావు బాలల చట్టాలపై అవగాహన కల్పించారు. 


పిల్లలకు పౌష్టికాహారం అందించాలి

పిల్లలకు పౌష్టికాహారం అందించాలని ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డిలోని బాల సదనాన్ని ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలసదనం ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని, పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అనంతరం పిల్లలతో ఆయన మాట్లాడారు. ఎలా చదువుతున్నారో కొన్ని చిన్న ప్రశ్నలు అడిగి వారి నుంచి జవాబులు తెలుసుకున్నారు. 


Updated Date - 2021-12-31T05:04:58+05:30 IST