నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులు

ABN , First Publish Date - 2021-05-21T04:52:20+05:30 IST

ఇంజనీరింగు అధికారుల మెతక వైఖరితో తూప్రాన్‌ మండలంలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిధులున్నా నర్సంపల్లి-నాచారం మార్గంలో లోలెవల్‌ బ్రిడ్జి నిర్మాణాన్ని కాంట్రాక్టర్‌ నిలిపివేసినా పట్టించుకోవడం లేదు.

నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులు
నర్సంపల్లి- నాచారం మార్గంలో నిలిచిపోయిన లోలెవల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు

 నిధులున్నా పనులు చేపట్టని కాంట్రాక్టర్‌.. పట్టించుకోని అధికారులు 


తూప్రాన్‌రూరల్‌, మే 20: ఇంజనీరింగు అధికారుల మెతక వైఖరితో తూప్రాన్‌ మండలంలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిధులున్నా  నర్సంపల్లి-నాచారం మార్గంలో లోలెవల్‌ బ్రిడ్జి నిర్మాణాన్ని కాంట్రాక్టర్‌ నిలిపివేసినా పట్టించుకోవడం లేదు. ఏడాదిన్నర క్రితమే రూ.60లక్షలు మంజూరయ్యాయి. పనులను స్థానికేతరుడైన కాంట్రాక్టర్‌ పనులను దక్కించుకున్నాడు. ఆరు నెలల క్రితం పనులను ప్రారంభించి, సీసీరోడ్డు వేయడానికి సిమెంటు గోడలు కట్టి వదిలేశాడు. నాలుగు నెలల నుంచి పనులు జరుగడం లేదు. చేసిన పనులకు వాటర్‌ క్యూరింగ్‌ చేయకపోవడంతో సిమెంటు గోడలు పగుళ్లు ఏర్పడ్డాయని గ్రామస్థులు, సర్పంచ్‌ సత్యనారాయణ  తెలిపారు. వర్షాకాలం వస్తే బ్రిడ్జి దగ్గర వరద ప్రవాహంతో రాకపోకలు ఆగిపోతాయని నర్సంపల్లి వాసులు అంటున్నారు. వానాకాలం ప్రారంభమయ్యేలోపే పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. లేదంటే తమకు ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు, కాంట్రాక్టరుకు ఎన్నిసార్లు చెప్పినా పట్టనట్లుగా ఉంటున్నారని చెప్పారు. సకాలంలో పనులు పూర్తి చేయని వారి కాంట్రాక్టును రద్దు చేసి ఇతరులకు  అప్పగించాలని అధికారులను కోరుతున్నారు.


 

Updated Date - 2021-05-21T04:52:20+05:30 IST