విద్యాధరి క్షేత్రంలో మూల మహోత్సవం

ABN , First Publish Date - 2021-11-09T06:09:31+05:30 IST

జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వర్గల్‌ మండల కేంద్రంలోని శంభుగిరి కొండలపై వెలసిన విద్యాధరి క్షేత్రంలో మూల మహోత్సవ వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు.

విద్యాధరి క్షేత్రంలో మూల మహోత్సవం
ప్రత్యేక అలంకరణలో అమ్మవారు

వర్గల్‌, నవంబరు 8: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వర్గల్‌ మండల కేంద్రంలోని శంభుగిరి కొండలపై వెలసిన విద్యాధరి క్షేత్రంలో మూల మహోత్సవ వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి నేతృత్వంలో విద్యా సరస్వతీ అమ్మవారికి విశేష పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పూజల అనంతరం విద్యా సరస్వతీ అమ్మవారిని సర్వాంగా సందరంగా అలంకరింపజేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పూల పూజ, సేవిక సమితి ఆధ్వర్యంలో లలితాపారాయణం  నిర్వహించారు. యాగ శాలలో చండీ హోమం చేశారు.  వేడుకల సందర్భంగా విద్యాధరి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. 


Updated Date - 2021-11-09T06:09:31+05:30 IST