ముక్క కోసం పాట్లు

ABN , First Publish Date - 2021-05-31T05:20:48+05:30 IST

ఈ ఫొటోల్లో ఉన్న జనాన్ని చూసి కరోనా వ్యాక్సిన్‌ కోసం నిల్చున్నారు అని అనుకుంటే పొరబడినట్లే.

ముక్క కోసం పాట్లు
తూప్రాన్‌లోని ఓ చికెన్‌ సెంటర్‌లో కిక్కిరిసిన జనం

సంగారెడ్డి క్రైం/తూప్రాన్‌, మే 30 : ఈ ఫొటోల్లో ఉన్న జనాన్ని చూసి కరోనా వ్యాక్సిన్‌ కోసం నిల్చున్నారు అని అనుకుంటే పొరబడినట్లే. వీరంతా కూడా ముక్క కోసం పడుతున్న తిప్ప లు. ఆదివారం మటన్‌, చికెన్‌ కోసం ప్రజలు భౌతికదూరాన్ని మరిచి గుమిగూడారు. లాక్‌డౌన్‌  సడలింపు సమయం ఉదయం 10 వరకే ఉండడంతో తెల్లవారుజాము నుంచే మాంసం దుకాణాల వద్ద క్యూ కట్టారు. కరోనా నిబంధనలు మరిచి కొనుగోళ్లు చేశారు. కొందరు మాస్కులు ధరించకుండానే తిరుగుతున్నారు. సంగారెడ్డిలోని పాతబస్టాండ్‌ ఫిష్‌ మార్కెట్‌ కూడా జనంతో కిక్కిరిసిపోయింది. 




Updated Date - 2021-05-31T05:20:48+05:30 IST