మత్స్యకారులకు సొసైటీలను ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2021-08-22T04:38:44+05:30 IST

ఒకే సొసైటీలో అనేక గ్రామాల చెరువులు, కుంటలు విలీనమై ఉన్న వాటిని విముక్తి చేసి ఆయా గ్రామాల్లో ఉన్న మత్స్యకారులకు ప్రత్యేక సొసైటీలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్‌ మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్‌ ముదిరాజ్‌ ప్రభుత్వాన్ని కోరారు.

మత్స్యకారులకు సొసైటీలను ఏర్పాటు చేయాలి

 టీఆర్‌ఎంఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌ డిమాండ్‌


చిన్నకోడూరు, ఆగస్టు 21: ఒకే సొసైటీలో అనేక గ్రామాల చెరువులు, కుంటలు విలీనమై ఉన్న వాటిని విముక్తి చేసి ఆయా గ్రామాల్లో ఉన్న మత్స్యకారులకు ప్రత్యేక సొసైటీలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్‌ మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్‌ ముదిరాజ్‌ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం మండలంలోని రామునిపట్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్స్యకారుల కోసం నియమించిన అధ్యయన సమన్వయ కమిటీలోకి నిత్యం మత్స్యకారుల కోసం పని చేస్తున్న టీఆర్‌ఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రమణ ముదిరాజ్‌ను తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం టీఆర్‌ఎంఎస్‌ జిల్లా సోషల్‌ మీడియా ఇన్‌చార్జిగా యాదగిరి, చిన్నకోడూరు మండల సహాయ కార్యదర్శిగా గణేష్‌, యూత్‌ ప్రధాన కార్యదర్శిగా హరీశ్‌ను ఎన్నుకుని, నియామకపత్రాలను అందజేశారు.  కార్యక్రమంలో టీఆర్‌యంఎస్‌ రాష్ట్ర కార్యదర్శి నర్సింహులు, జిల్లా ఉపాధ్యక్షుడు నాగార్జున, యూత్‌ అధ్యక్షుడు కరుణాకర్‌, మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌, యూత్‌ అధ్యక్షుడు గణేష్‌, సంఘం సభ్యులు పాల్గొన్నారు.


 

Updated Date - 2021-08-22T04:38:44+05:30 IST