యాసంగిలో ఆరుతడి పంటలను సాగు చేయాలి
ABN , First Publish Date - 2021-10-29T04:47:48+05:30 IST
యాసంగిలో ఆరుతడి పంటలను సాగు చేయాలని జిల్లా ఉద్యానవన అధికారి రామలక్ష్మి సూచించారు.

జిల్లా ఉద్యానవన అధికారి రామలక్ష్మి
జగదేవ్‌పూర్, అక్టోబరు 28: యాసంగిలో ఆరుతడి పంటలను సాగు చేయాలని జిల్లా ఉద్యానవన అధికారి రామలక్ష్మి సూచించారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామాలైన మర్కుక్ మండలంలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద సామూహిక బిందు సేద్యంలో సాగు చేసిన పంటలను గురువారం నెటఫీమ్ ప్రతినిధి సుబ్బారావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యాసంగిలో వరికి బదులుగా వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, మొక్కజొన్న, నల్ల రేగడి నేలలో శనగ పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. పంట మార్పిడితో భూసారం పెరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి డా.టి.నాగేందర్‌రెడ్డి, ఉద్యాన అధికారి ధీరాజ్, సర్పంచ్ భాగ్యభిక్షపతి, వీడీసీ కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.