కరోనాతో ఆరుగురి మృతి

ABN , First Publish Date - 2021-05-02T05:36:47+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ బారిన పడి నలుగురు మృతిచెందారు. రామాయంపేట పట్టణానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకడంతో వారం రోజులుగా ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. శనివారం చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు.

కరోనాతో ఆరుగురి మృతి

 మెదక్‌ జిల్లాలో ముగ్గురు


మెదక్‌ అర్బన్‌, మే 1: జిల్లాలో కొవిడ్‌ బారిన పడి నలుగురు మృతిచెందారు. రామాయంపేట పట్టణానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకడంతో వారం రోజులుగా ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. శనివారం చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు, నార్సింగి గ్రామానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతి చెందారు.


జూకల్‌ ఉప సర్పంచ్‌ మృతి..


నారాయణఖేడ్‌, మే 1: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండల పరిధిలోని జుకల్‌ గ్రామ ఉప సర్పంచ్‌  కరోనాతో చనిపోయారు. గురువారం రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో అదేరోజు రాత్రి కుటుంబీకులు సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ టెస్ట్‌ చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో చికిత్స పొందుతూ శుక్రవారం  రాత్రి  మృతి చెందారు. అతడి మరణ వార్తను తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన అతడి మేనమామ షాక్‌కు గురై శుక్రవారం రాత్రే మృతి చెందాడు. ఇద్దరి అంత్యక్రియలను కొవిడ్‌ నిబంధనలతో పూర్తి చేశారు. 


కరోనాతో తిమ్మారెడ్డిపల్లి సర్పంచ్‌ మృతి


కొండపాక, మే 1: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి సర్పంచ్‌ కూరెల్ల అనురాధ కరోనాతో శనివారం మధ్యాహ్నం మృతి చెందారు. అనురాధకు వారం రోజుల క్రితం కరోనా సోకడంతో  సిద్దిపేటలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం పరిస్థితి విషమించడంతో మధ్యాహ్నం ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడికి తరలించిన కొంత సమయం తర్వాత ఆమె మృతి చెందారు. 


కొత్తపల్లిలో ఒకరు


రాయపోల్‌, మే 1: సిద్దిపేట జిల్లా రాయపోల్‌ మండలం కొత్తపల్లిలో కరోనాతో ఒకరు మృతి చెందారు.  వారం రోజుల క్రితం సదరు వ్యక్తికి కరోనా నిర్ధారణ కావడంతో హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. శనివారం తెల్లవారుజామున అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందారు.


 

Updated Date - 2021-05-02T05:36:47+05:30 IST