హత్య కేసులో ఆరుగురు నిందితుల అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-06-22T05:30:00+05:30 IST

కోహీర్‌ మండలంలోని మద్రి గ్రామంలో 20న జరిగిన జహీరోద్దీన్‌ హత్య కేసులో ఆరుగురు నిందితులను మంగళవారం అరెస్ట్‌ చేశామని పట్టణ సీఐ రాజశేఖర్‌ తెలిపారు.

హత్య కేసులో ఆరుగురు నిందితుల అరెస్ట్‌

జహీరాబాద్‌, జూన్‌ 22 : కోహీర్‌ మండలంలోని మద్రి గ్రామంలో 20న జరిగిన జహీరోద్దీన్‌ హత్య కేసులో ఆరుగురు నిందితులను మంగళవారం అరెస్ట్‌ చేశామని పట్టణ సీఐ రాజశేఖర్‌ తెలిపారు. పట్టణంలోని సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కోహీర్‌ మండలంలోని మద్రి గ్రామంలో భూతగాదా (భూపంపిణీ) విషయంలో మృతుడు జహీర్‌ను గ్రామానికి చెందిన గఫూర్‌ అలియాస్‌ గఫ్రుద్దీన్‌, పర్దీన్‌, ఫాజీలుద్దీన్‌, మహ్మద్‌రిజ్వాన్‌, షఫియోద్దీన్‌, కమ్రుద్దీన్‌ మారణాయుధాలతో దాడిచేసి హత్యచేశారు. ఈ మేరకు వారిని అరెస్ట్‌ చేసి మంగళవారం కోర్టులో హాజరుపరిచామన్నారు. భూతగాదానే హత్యకు దారితీసిందన్నారు. ఈ కార్యక్రమంలో కోహీర్‌ ఎస్‌ఐ రాజశేఖర్‌, చిరాగ్‌పల్లి ఎస్‌ఐ కాశీనాథ్‌, జహీరాబాద్‌రూరల్‌ఎ్‌సఐ రవికుమార్‌, పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T05:30:00+05:30 IST