సాదాసీదాగా కౌన్సిల్‌ సమావేశం

ABN , First Publish Date - 2021-10-30T04:26:06+05:30 IST

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్సీ రాజమౌళి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశం సాదాసీదాగా సాగింది.

సాదాసీదాగా కౌన్సిల్‌ సమావేశం

  పలు అంశాలపై తీర్మానం


గజ్వేల్‌, అక్టోబరు 29: గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్సీ రాజమౌళి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశం సాదాసీదాగా సాగింది. ఈ సందర్భంగా పట్టణంలోని అన్ని వార్డుల్లో వందశాతం వ్యాక్సినేషన్‌, 75 మైక్రాన్ల కంటే తక్కువగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కవర్ల తయారీ,  అమ్మకం, వాడకం, నిల్వ, రవాణా చేయడాన్ని ఈ నెల 30నుంచి నిషేధిస్తూ, డిసెంబరు 31నుంచి 120మైక్రాన్‌ల ప్లాస్టిక్‌ కవర్ల వాడకాన్ని అమలు చేసేందుకు, ఎజెండాలోని పలు అభివృద్ధి పనులపై ఏకగ్రీవంగా కౌన్సిల్‌లో ఆమోదించారు. ఈ సమావేశంలో కమిషనర్‌ వెంకటగోపాల్‌, వైస్‌-చైర్మన్‌ జకీయొద్దీన్‌, పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.


 

Updated Date - 2021-10-30T04:26:06+05:30 IST