త్వరలో సీడ్‌హబ్‌గా సిద్దిపేట

ABN , First Publish Date - 2021-12-26T05:53:49+05:30 IST

త్వరలో సిద్దిపేట సీడ్‌హబ్‌గా మారనున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. జిల్లాలో విత్తనోత్పత్తి, విత్తన ధ్రువీకరణ కోసం సేవలను విస్తృతం చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శనివారం సిద్దిపేట పట్టణంలో రాష్ట్ర విత్తన- సేంద్రియ ధ్రువీకరణ అథారిటీ సంస్థ కోసం నూతన భవనం, గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

త్వరలో సీడ్‌హబ్‌గా సిద్దిపేట

సిద్దిపేట సమీకృత మార్కెట్‌కు రాష్ట్రంలోనే తొలి ఐఎస్‌వో సర్టిఫికెట్‌ : మంత్రి హరీశ్‌రావు


సిద్దిపేట అగ్రికల్చర్‌, డిసెంబరు 25 : త్వరలో సిద్దిపేట సీడ్‌హబ్‌గా మారనున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. జిల్లాలో విత్తనోత్పత్తి, విత్తన ధ్రువీకరణ కోసం సేవలను విస్తృతం చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శనివారం సిద్దిపేట పట్టణంలో రాష్ట్ర విత్తన- సేంద్రియ ధ్రువీకరణ అథారిటీ సంస్థ కోసం నూతన భవనం, గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇక జిల్లాలోని రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

రాష్ట్రంలోనే మొదటిసారిగా సిద్దిపేట సమీకృత మార్కెట్‌కు ఐఎ్‌సవో సర్టిఫికెట్‌ రావడం ఆనందంగా ఉందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇది సిద్దిపేట జిల్లా ప్రజలందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వివరించేందుకు రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి వెళితే పట్టించుకోవడం లేదని మంత్రి మండిపడ్డారు. సిద్దిపేట ప్రాంతంలో పండే పంటలు, వ్యవసాయ వస్తువుల ధరలు, మార్కెటింగ్‌ ప్రక్రియకు సంబంధించి సిద్దిపేట డిగ్రీ ఎకనామి కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనున్నారని మంత్రి తెలిపారు. ఈ మేరకు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రసాద్‌, ఏఎంసీ చైర్మన్‌ పాల సాయిరాం మంత్రి సమక్షంలో ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, సీడ్‌ కార్పొరేషన్‌ ఎండీ కేశవులు పాల్గొన్నారు.



Updated Date - 2021-12-26T05:53:49+05:30 IST