అభివృద్ధిపై సమన్వయంతో పని చేయాలి
ABN , First Publish Date - 2021-08-26T03:46:50+05:30 IST
గ్రామాల అభివృద్ధి, పాఠశాలల నిర్వహణపై ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ సూచించారు.

మండల సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ
చిన్నకోడూరు, ఆగస్టు 25: గ్రామాల అభివృద్ధి, పాఠశాలల నిర్వహణపై ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ సూచించారు. బుధవారం చిన్నకోడూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రోజాశర్మ మాట్లాడారు. 1 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. వ్యవసాయం, ఆర్‌డబ్య్లూఎస్, విద్య, వైద్యం, పంచాయతీరాజ్, విద్యుత్, ఇరిగేషన్, ఉపాధిహమీ, రెవెన్యూ శాఖలపై చర్చించారు. గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను పలువురు సర్పంచ్‌లు సభ దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్ సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని విద్యుత్ శాఖ అధికారులు బదులిచ్చారు. గ్రామంలో నూతన ఇండ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం లేదని ఎల్లాయిపలి సర్పంచ్ మహేందర్ సభ దృష్టికి తీసుకురాగా.. సమస్యను పరిష్కరిస్తామని ఎంపీవో సోమిరెడ్డి తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ఎంపీపీ మాణిక్యరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. వృద్ధాప్య పింఛన్లకు దరఖాస్తు చేసుకునే విధంగా గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. అనంతరం మండలంలోని ముగ్గురు లబ్ధిదారుకలు రైతుబీమా ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. సమావేశంలో వైస్ ఎంపీపీ పాపయ్య, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్, పీఏసీఏస్ చైర్మన్‌లు సదానందం, కనకరాజు, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివా్‌సరావు, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.