రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2021-02-05T05:47:12+05:30 IST

రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలైన సంఘటన ఖేడ్‌ మండలం ర్యాలమడుగు శివారులో చోటు చేసుకున్నది.

రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు

నారాయణఖేడ్‌, ఫిబ్రవరి 4 : రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలైన సంఘటన ఖేడ్‌ మండలం ర్యాలమడుగు శివారులో చోటు చేసుకున్నది. కల్హేర్‌ మండలం బాచేపల్లికి చెందిన గణేష్‌ (25) గురువారం బైక్‌పై ఖేడ్‌కు వస్తున్నాడు. ర్యాలమడుగు శివారులోకి రాగానే అడవి పందులు అడ్డువచ్చాయి. వాటిని తప్పించే క్రమంలో బైక్‌ అదుపు తప్పి గణేష్‌ కిందపడ్డాడు. ఈ ఘటనలో అతడి తలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్‌ ఈటీఎం గురప్ప ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స చేసి ఖేడ్‌ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. 


Updated Date - 2021-02-05T05:47:12+05:30 IST