అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-12-30T06:00:07+05:30 IST

మండలంలోని తునికి బొల్లారం గ్రామ సమీపంలో మంగళవారం అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పోలీసులకు పట్టుబడింది.

అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత
తునికి బొల్లారం సమీపంలో పట్టుబడిన రేషన్‌బియ్యం, నిందితులు

ములుగు. డిసెంబరు 29:  మండలంలోని తునికి బొల్లారం గ్రామ సమీపంలో  మంగళవారం అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పోలీసులకు పట్టుబడింది.  బుధవారం ఎస్‌ఐ రంగ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని దాసర్ల పల్లి గ్రామానికి చెందిన బుక్య భిక్షపతి, బుక్య రమేష్‌ ఇద్దరు రాత్రి 8గంటల సమయంలో ఓ ఆటోలో 10 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్నారు. అదే సమయంలో తునికి బొల్లారం గ్రామ శివారులో పెట్రోలింగ్‌ చేస్తున్న ఎస్‌ఐ రంగకృష్ణ, హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్స్‌ నరేష్‌, గిరి వాహనాల తనిఖీ చేపట్టారు. ఆటోలో అనుమానాస్పదంగా బియ్యం కనిపించడంతో  బుక్య భిక్షపతి, బుక్య రమే్‌షలను అదుపులోకి తీసుకుని విచారించగా వారు రేషన్‌ బియ్యాన్ని  అక్రమంగా తరలిస్తున్నట్టు అంగీకరించారు.  ములుగు మండలంలోని చుట్టుపక్కల గ్రామాల్లో తక్కువ రేటుకు రేషన్‌ బియ్యాన్ని  కొని తూప్రాన్‌, మనోహరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న  పౌలీ్ట్రఫాంలలో  ఎక్కువ రేటుకు అమ్మడానికి తీసుకువెళ్తున్నట్టు నిందితులు చెప్పారు. కాగా అక్రమంగా తరలిస్తున్న  రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వివరించారు. 

Updated Date - 2021-12-30T06:00:07+05:30 IST