నిషేధిత గుట్కా, అంబర్‌ ప్యాకెట్ల పట్టివేత

ABN , First Publish Date - 2021-03-25T05:32:06+05:30 IST

మండలంలోని వరుకోలు గ్రామంలో ప్రభుత్వం నిషేధించిన సుమారు మూడు లక్షల గుట్కా, అంబర్‌ ప్యాకెట్లను పట్టుకుని ఒకరిపై కేసు నమోదు చేసినట్టు హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌ తెలిపారు.

నిషేధిత గుట్కా, అంబర్‌ ప్యాకెట్ల పట్టివేత
వివరాలను వెల్లడిస్తున్న ఏసీపీ

కోహెడ, మార్చి 24 : మండలంలోని వరుకోలు గ్రామంలో ప్రభుత్వం నిషేధించిన సుమారు మూడు లక్షల గుట్కా, అంబర్‌ ప్యాకెట్లను పట్టుకుని ఒకరిపై కేసు నమోదు చేసినట్టు హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌ తెలిపారు. బుధవారం పోలీ్‌సస్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామానికి చెందిన బాలగోని వేణు దోనపాటి కనకవ్వ ఇంటి వెనకాల ఖాళీ స్థలంలో గుట్కా ప్యాకెట్లను దాచిపెట్టాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ రాజకుమార్‌, సిబ్బందితో అక్కడికి వెళ్లేసరికి వేణు పోలీసులను చూసి పారిపోయాడు. దీంతో గుట్కా, అంబర్‌ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని అతడిపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో హుస్నాబాద్‌ సీఐ రఘుపతిరెడ్డి, కోహెడ ఎస్‌ఐ రాజకుమార్‌, పోలీసులు ఉన్నారు. 

Updated Date - 2021-03-25T05:32:06+05:30 IST