సర్పంచ్‌ భర్త పెత్తనం మాకొద్దు

ABN , First Publish Date - 2021-02-06T05:18:18+05:30 IST

వెల్దుర్తి ఫిబ్రవరి 5 : సర్పంచ్‌ భర్త పెత్తనం మాకొద్దని మండలంలోని శాంశరెడ్డిపల్లి తండావాసులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తండావాసులు మాట్లాడుతూ కొత్త పంచాయతీగా ఏర్పాటైన శాంశరెడ్డిపల్లి తండాకు రమావత్‌ శాంతిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే పదవిని అడ్డుపెట్టుకుని ఆమె భర్త సాగిస్తున్న ఆగడాలు పెరిగిపోయాయని తెలిపారు. పాలనపరమైన అంశాల్లో సర్పంచ్‌ భర్త సీతనాయక్‌ పెత్తనం చెలాయిస్తూ గ్రామస్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని గిరిజనులు ఆరోపించారు.

సర్పంచ్‌ భర్త పెత్తనం మాకొద్దు

ఎంపీడీవో కార్యాలయం సూపరింటెండెంట్‌కు శాంశరెడ్డిపల్లి తండావాసుల ఫిర్యాదు


వెల్దుర్తి ఫిబ్రవరి 5 : సర్పంచ్‌ భర్త పెత్తనం మాకొద్దని మండలంలోని శాంశరెడ్డిపల్లి తండావాసులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తండావాసులు మాట్లాడుతూ కొత్త పంచాయతీగా ఏర్పాటైన శాంశరెడ్డిపల్లి తండాకు రమావత్‌ శాంతిని  ఏకగ్రీవంగా ఎన్నుకుంటే పదవిని అడ్డుపెట్టుకుని ఆమె భర్త సాగిస్తున్న ఆగడాలు పెరిగిపోయాయని తెలిపారు. పాలనపరమైన అంశాల్లో సర్పంచ్‌ భర్త సీతనాయక్‌ పెత్తనం చెలాయిస్తూ గ్రామస్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని గిరిజనులు ఆరోపించారు. తండాలోని మరో ఐదుగురితో కలిసి దళారీ దందా చేస్తున్నారని ఆరోపించారు. గ్రామ పెద్దలంతా కూర్చుని చెప్పినా అతని తీరు మారలేదని పేర్కొన్నారు.


తండాకు  చెందిన సురేష్‌, గనేశ్‌, రాజు, హరి, ఉమూలాలతో కలిసి హైదరాబాద్‌ నుంచి వచ్చిన పలువురితో కలిసి తండాలో భూమి ఉందని నమ్మబలికి రూ.20 లక్షలు దండుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్పంచ్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. అక్రమాలకు పాల్పడుతున్న సీతనాయక్‌తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేయాలని వెల్దుర్తి ఎస్‌ఐ మహేందర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో తండవాసులు జమ్మలనాయక్‌, భద్ర, గోప్య, దనుజ, విఠల్‌, శంకర్‌, పూర్ణేశతో పాటు 60 మంది ఉన్నారు.


Updated Date - 2021-02-06T05:18:18+05:30 IST