ఉదయాన్నే పారిశుధ్య పనులు జరగాలి
ABN , First Publish Date - 2021-08-04T03:45:50+05:30 IST
పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని, ప్రతీరోజు ఉదయాన్నే పారిశుధ్య పనులు నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ రమణాచారి కార్మికులకు సూచించారు.

మున్సిపల్ కమిషనర్ రమణాచారి
సిద్దిపేట సిటీ, ఆగస్టు 3: పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని, ప్రతీరోజు ఉదయాన్నే పారిశుధ్య పనులు నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ రమణాచారి కార్మికులకు సూచించారు. మంగళవారం పట్టణంలోని స్వచ్ఛబడి, మందపల్లి, 1, 6వ వార్డు కంపోస్టు యార్డులను, బాల సదనం, మిడిల్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను కమిషనర్ పరిశీలించారు. స్వచ్ఛబడిలో పెరిగిన పిచ్చి గడ్డిని తొలగించాలని ఆదేశించారు. మొక్కలు కీటకాల బారిన పడకుండా క్రిమిసంహారక మందులు పిచికారీ చేయాలన్నారు. మూత్రశాలలోని నీటి కుళాయిలు మరమ్మతు చేయించాలని ఆదేశించారు. 1వ వార్డులోని లింగారెడ్డిపల్లిలోని కంపోస్టు యార్డును తనిఖీ చేసి, ఎరువు తయారీపై ఆరా తీశారు. మిడిల్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో మురుగు కాలు నిర్మాణ పనులు వెంటనే చేపట్టి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఏఈ రంజిత్‌ని ఆదేశించారు. ఆయనవెంట ఏఈలు రంజిత్, యాదగిరి, శానిటరీ ఇన్స్‌స్పెక్టర్ బాల ఎల్లం ఉన్నారు.