సంగారెడ్డి జిల్లా: బతుకమ్మ వేడుకల్లో విషాదం

ABN , First Publish Date - 2021-10-14T18:38:21+05:30 IST

సంగారెడ్డి జిల్లా: పుల్కల్ మండల కేంద్రంలో బతుకమ్మ వేడుకల్లో విషాదం నెలకొంది.

సంగారెడ్డి జిల్లా: బతుకమ్మ వేడుకల్లో విషాదం

సంగారెడ్డి జిల్లా: పుల్కల్ మండల కేంద్రంలో బతుకమ్మ వేడుకల్లో విషాదం నెలకొంది. బుధవారం రాత్రి బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తుండగా కాలు జారీ చాకలి శేఖర్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. అప్రమత్తమైన స్థానికులు శేఖర్‌ను  కాపాడి.. మండల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో శేఖర్‌ను సంగారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పుల్కల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది  నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని బంధువులు, గ్రామస్తుల ఆందోళన చేపట్టారు.

Updated Date - 2021-10-14T18:38:21+05:30 IST