ఆర్టీపీసీఆర్‌ ఇక్కడే

ABN , First Publish Date - 2021-05-02T05:48:21+05:30 IST

కొవిడ్‌ నిర్ధారణ కోసం నిర్వహించే ఆర్టీపీసీఆర్‌ (రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ పాలిమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌) పరీక్షలు ఇకపై సంగారెడ్డిలోనే నిర్వహించనున్నారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా ఆస్పత్రితో పాటు పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రిలో శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి పంపిస్తున్నారు. అక్కడి సిబ్బంది పరిస్థితులను బట్టి గాంధీ ఆస్పత్రి ల్యాబ్‌తో పాటు ఉస్మానియా, ఫీవర్‌, నిమ్స్‌, చెస్ట్‌, సనత్‌నగర్‌ ఈఎ్‌సఐ ఆసుపత్రుల ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. ఫలితం ఫోన్లకు సందేశం రూపంలో పంపిస్తున్నారు. తొలుత 24 గంటల్లో ఫలితాలు వచ్చేవి. ప్రస్తుతం నాలుగు రోజులైనా ఫలితం రావడంలేదు.

ఆర్టీపీసీఆర్‌ ఇక్కడే
ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌ కోసం సంగారెడ్డి ఆసుపత్రిలో సిద్ధమవుతున్న భవనం

సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో సిద్ధమవుతున్న ల్యాబ్‌

పదిహేను రోజుల్లో పరీక్షలు మొదలు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, మే 1: కొవిడ్‌ నిర్ధారణ కోసం నిర్వహించే ఆర్టీపీసీఆర్‌ (రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ పాలిమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌) పరీక్షలు ఇకపై సంగారెడ్డిలోనే నిర్వహించనున్నారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా ఆస్పత్రితో పాటు పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రిలో శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి పంపిస్తున్నారు. అక్కడి సిబ్బంది పరిస్థితులను బట్టి గాంధీ ఆస్పత్రి ల్యాబ్‌తో పాటు ఉస్మానియా, ఫీవర్‌, నిమ్స్‌, చెస్ట్‌, సనత్‌నగర్‌ ఈఎ్‌సఐ ఆసుపత్రుల ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. ఫలితం ఫోన్లకు సందేశం రూపంలో పంపిస్తున్నారు. తొలుత 24 గంటల్లో ఫలితాలు వచ్చేవి. ప్రస్తుతం నాలుగు రోజులైనా ఫలితం రావడంలేదు.


అత్యాధునిక యంత్రాల ఏర్పాటు

కేసులు పెరుగుతుండడం.. ఆర్టీపీసీఆర్‌ ఫలితాలు ఆలస్యం అవుతున్న తరుణంలో ప్రభుత్వం సంగారెడ్డిలోనే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం అవసరమైన నిధులను మంజూరు చేసింది. ల్యాబ్‌ కోసం జిల్లా ఆసుపత్రి ఆవరణలోని కుష్టు నివారణ కేంద్రంలోని ఒక బ్లాక్‌ను అధికారులు ఎంపిక చేశారు. ల్యాబ్‌లో పరీక్షల కోసం ఉపయోగించే యంత్రాలను రూ.1.16 కోట్లు వెచ్చించి తెప్పిస్తున్నారు. ల్యాబ్‌లో మౌలిక వసతలు, ఇతర సదుపాయాలకు సంబంధించిన పనులను రూ.16.60 లక్షలతో వైద్య సదుపాయాల కల్పన సంస్థ ఆధ్వర్యంలో చేపట్టారు. మరో పది రోజుల్లో ల్యాబ్‌ పనులు పూర్తి కానున్నాయి. వెంటనే యంత్రాలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. మరో పదిహేను రోజుల్లో ల్యాబ్‌లో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు మొదలుపెడగామని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రి నుంచి కూడా శాంపిళ్లను ఇక్కడికే పంపించనున్నారు. ల్యాబ్‌ అందుబాటులోకి వస్తే ఫలితాలు కూడా త్వరగా వెల్లడయ్యే అవకాశాలున్నాయి.


దూరభారం తగ్గేనా?

ప్రస్తుతం ఆర్టీపీసీఆర్‌ పరీక్షల కోసం శాంపిళ్లను జిల్లాలో కేవలం రెండు ప్రాంతాల్లోనే సేకరిస్తున్నారు. జిల్లా సరిహద్లుల్లో ఉన్న నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ ప్రాంతాలకు చెందినవారు టెస్టు కోసం సంగారెడ్డికి రావడానికి అనేక తిప్పలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. అందుకే ఇకపై సదాశివపేట, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, జోగిపేట ఏరియా ఆసుపత్రుల్లోనూ ఆర్టీపీసీఆర్‌ పరీక్షల కోసం శాంపిళ్లను సేకరించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-05-02T05:48:21+05:30 IST