సంగారెడ్డి మెడికల్‌ కాలేజీకి 19 మంది ప్రొఫెసర్ల నియామకం

ABN , First Publish Date - 2021-12-30T05:45:06+05:30 IST

సంగారెడ్డికి మంజూరైన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి 19 మంది ప్రొఫెసర్లను నియమిస్తూ డీఎంఈ రమేశ్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో రేడియో డయాగ్నోస్టిక్‌-1, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌-1, జనరల్‌ మెడిసిన్‌-3, ఆప్తమాలజీ-1, గ్రాస్త్రో ఎంట్రాలజీ-1, సైక్యాట్రి-1

సంగారెడ్డి మెడికల్‌ కాలేజీకి  19 మంది ప్రొఫెసర్ల నియామకం

సంగారెడ్డి అర్బన్‌, డిసెంబరు 29: సంగారెడ్డికి మంజూరైన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి 19 మంది ప్రొఫెసర్లను నియమిస్తూ డీఎంఈ రమేశ్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో రేడియో డయాగ్నోస్టిక్‌-1, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌-1, జనరల్‌ మెడిసిన్‌-3, ఆప్తమాలజీ-1, గ్రాస్త్రో ఎంట్రాలజీ-1, సైక్యాట్రి-1, ఆర్ధోఫెడిక్‌-1, ఈఎన్‌టీ-1, ఫార్మకాలజీ-1, మైక్రోబయోలజీ-1, అనాటమీ-1, పాతాలజీ-1, సోషల్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌-1, టిబి అండ్‌ సీడీ-1, ఫిజియోలజీ-1, జనరల్‌ సర్జరీ ఇద్దరు నియమితులయ్యారు. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ హోదాలో ఉన్న వీరికి ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించి సంగారెడ్డి మెడికల్‌ కాలేజీకి పోస్టింగులు ఇచ్చారు. 15 రోజుల్లో విధుల్లో చేరాలని డీఎంఈ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే వారిలో బుధవారం ఇద్దరు విధుల్లో చేరారని జిల్లా ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంగారెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-12-30T05:45:06+05:30 IST