రాజీవ్‌గాంధీ సేవలు మరువలేనివి

ABN , First Publish Date - 2021-08-21T04:55:54+05:30 IST

రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు.

రాజీవ్‌గాంధీ సేవలు మరువలేనివి
గజ్వేల్‌లో రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న నర్సారెడ్డి

 జయంతి వేడుకల్లో డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి


గజ్వేల్‌, ఆగస్టు 20: రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. రాజీవ్‌గాంధీ 77వ జయంతి సందర్భంగా గజ్వేల్‌ పట్టణంలో శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడారు. దేశానికి ఐటీ టెక్నాలజీని పరిచయం చేసింది రాజీవ్‌గాంధీయేనని అన్నారు. కార్యక్రమంలో పీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ నాయిని యాదగిరి, గోపాల్‌రావు, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సమీర్‌, మండలాధ్యక్షుడు మద్దూరి మల్లారెడ్డి, మోహాన్నగారి రాజు, పీసీసీ నాయకులు కుంట్ల లక్ష్మారెడ్డి, మహ్మద్‌ ఇక్బాల్‌, కృష్ణమూర్తి, నాయకులు గడ్డం చంద్రం, వెంకట్‌గౌడ్‌, లక్ష్మణ్‌, లక్ష్మీనారాయణ, శ్రీనివా్‌సరెడ్డి, టిల్లురెడ్డి, క్యాసారం రవి, సొక్కం సురేశ్‌ పాల్గొన్నారు. అలాగే గజ్వేల్‌ పట్టణంలోని పీసీసీ రాష్ట్ర నాయకుడు జశ్వంత్‌రెడ్డి నివాసంలో యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్ధార్‌ఖాన్‌ ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు గుంటుకు శ్రీనివాస్‌, కాశమైన శ్రీకాంత్‌, రామస్వామి, యాదయ్య, అంజత్‌, బాలు, కర్ణాకర్‌, వంశీ పాల్గొన్నారు. 

చిన్నకోడూరు, ఆగస్టు 20: కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు మిట్టపల్లి గణేష్‌ ఆధ్వర్యంలో చిన్నకోడూరులో రాజీవ్‌గాంధీ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌, జిల్లా అధికార ప్రతినిధి రాజశేఖర్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి కనకరాజు, మండల ఉపాధ్యక్షుడు బాల్‌రాజు, కార్యదర్శి సత్యనారాయణ, అజ్జు, చిరంజీవి పాల్గొన్నారు. 

బెజ్జంకి: బెజ్జంకిలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు చెప్యాల శ్రీనివా్‌సగౌడ్‌, జిల్లా ఎస్సీ సెల్‌  ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌, యూత్‌ కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌, కిసాన్‌ సెల్‌ మండలాధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి, రవి, పరశురాములు, మల్లేశం, కొమురయ్య, నర్సయ, శంకర్‌, వజీద్‌, మహేందర్‌, రాజు, లక్ష్మణ్‌, మహేందర్‌, అలీ, మనోహర్‌, పాల్గొన్నారు.


 

Updated Date - 2021-08-21T04:55:54+05:30 IST