ఆస్పత్రుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

ABN , First Publish Date - 2021-12-31T17:20:21+05:30 IST

ఆస్పత్రుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని క్వాలిటీ మేనేజర్‌ రవిచింతల సూచించారు.

ఆస్పత్రుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

 క్వాలిటీ మేనేజర్‌ రవిచింతల

సంగారెడ్డి అర్బన్‌, డిసెంబరు 30 : ఆస్పత్రుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని క్వాలిటీ మేనేజర్‌ రవిచింతల సూచించారు. సంగారెడ్డిలోని ఎంసీహెచ్‌లో డిస్ట్రిక్ట్‌ లెవల్‌ కాయకల్ప ఓరియంటేషన్‌ కం ట్రైనింగ్‌ ప్రోగ్రాంలో భాగంగా పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్లు, టీవీవీపీ ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కాయకల్ప అవార్డు సాధనలో భాగంగా ఆస్పత్రుల్లో అన్ని రికార్డులు సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా హాస్పిటల్‌ ఆఫ్‌ కీపింగ్‌, శానిటేషన్‌ అండ్‌ హైజిన్‌, సపోర్టు సర్వీసెస్‌, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌, హైజిన్‌ ప్రమోషన్‌ తదితర విషయాలను పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో మెడికల్‌ ఆఫీసర్లు, టీవీవీపీ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T17:20:21+05:30 IST