కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2021-10-30T04:27:26+05:30 IST
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కొక్కుల కీర్తి, జడ్పీటీసీ శ్యామల అన్నారు.

ఎంపీపీ కొక్కుల కీర్తి, జడ్పీటీసీ శ్యామల
కోహెడ, అక్టోబరు 29: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కొక్కుల కీర్తి, జడ్పీటీసీ శ్యామల అన్నారు. శుక్రవారం కోహెడ, తంగళ్లపల్లి, శనిగరం, గుండారెడ్డిపల్లి, బస్వాపూర్, ఆరెపల్లి, పోరెడ్డిపల్లి, వరికోలు, తీగలకుంటపల్లి, నాగసముద్రాల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. పంటలకు గిట్టుబాటు ధర, రైతులకు నాణ్యమైన విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని వారన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆవుల రాదమ్మ, మండల రైతుబంధు అధ్యక్షుడు పెర్యాల రాజేశ్వరరావు, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు మహేందర్, ఎంపీడీవో మెరుగు శ్రీధర్, తహసీల్దార్ బి.రుక్మిణిరెడ్డి, ఏపీఎం తిరుపతి, ఏవో భోగేశ్వర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని కోహెడ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో సముద్రాల, వెంకటేశ్వరపల్లి, సీసీపల్లి, గొట్లమిట్ల. నారాయణపూర్, ఎర్రగుంటపల్లి, విజయనగర కాలనీ, వింజపల్లి, ధర్మసాగర్‌పల్లి, పరివేద, నకిరికొమ్ముల, శ్రీరాములపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆ సంఘం (ఫ్యాక్స్) చైర్మన్ పెర్యాల దేవేందర్‌రావు ప్రాంభించారు. కార్యక్రమంలో సీఈఓ ముంజ మల్లికార్జున్, డైరెక్టర్ గుండ తిరుపతి, ఏఈవో సాయికృష్ణ, కోళ్ల రాంరెడి,్డ పాల్గొన్నారు.
అంగడికిష్టాపూర్, శివారు వెంకటపూర్‌లో
జగదేవ్‌పూర్, అక్టోబరు 29: మర్కుక్ మండల పరిధిలోని అంగడికిష్టాపూర్, శివారు వెంకటపూర్ గ్రామాల్లో ఐకేపీ అధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ తాండ పాండుగౌడ్, జడ్పీటీసీ యెంబరి మంగమ్మరాంచంద్రంయాదవ్ ప్రారంభించారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి నాగేందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ మంద బాల్‌రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వరరెడ్డి, ఐకేపీ ఏపీఎ శైలజా, సర్పంచులు దుద్దెడ లక్ష్మీరాములుగౌడ్, పుట్ట మంజులానర్సింహులు, ఎంపీటీసీ నరేందర్, ఉప సర్పంచులు కొండల్‌రెడ్డి, కానమైన రాజు, ఐకేపీ సీసీలు రమేష్, కవిత, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు తుమ్మల కనకయ్య, బాల్‌రెడ్డి, ఆంజనేయులు, సుదర్శన్‌గౌడ్, రాముగౌడ్, గోగు మల్లేశం, సతీష్ పాల్గొన్నారు.
రైతులు ఇబ్బందులు పడొద్దు
కొండపాక, అక్టోబరు 29: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి సూచించారు. కొండపాక రైతు వేదికలో శుక్రవారం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై మండల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలో 21 గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీపీ రాగల సుగుణ, వైస్ ఎంపీపీ దేవి రవీందర్, వ్యవసాయాధికారి ప్రభాకర్‌రావు, ఎంపీడీవో రాంరెడ్డి, తహసీల్దార్ ఆశాజ్యోతి, సర్పంచులు. ఎంపీటీసీలు, పీఏసీఎస్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ధర్నా
చేర్యాల, అక్ట్టోబరు 29: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరుతూ చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట సీపీఎం నాయకులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మార్కెట్‌యార్డు సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కొంగరి వెంకట్‌మావో, నాయకులు మేడిపల్లి చందు, బోయిని మల్లేశం, బొడిగం నర్సిరెడ్డి, పాక వెంకటేశ్, పండగ యాదగిరి, గుండ్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.