కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2021-10-29T04:44:51+05:30 IST
కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీపీఏం కరుణాకర్ అన్నారు. గురువారం మండల మహిళా సమైక్య కార్యాలయంలో ఽధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు.

డీపీఏం కరుణాకర్
చిన్నకోడూరు, అక్టోబరు 28: కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీపీఏం కరుణాకర్ అన్నారు. గురువారం మండల మహిళా సమైక్య కార్యాలయంలో ఽధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు ధాన్యాన్ని బావి వద్దనే ఆరబెట్టుకోని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఏం మహిపాల్, సీసీలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
హుస్నాబాద్‌లో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా అధికారి అవగాహన
హుస్నాబాద్, అక్టోబరు 28: పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో గురువారం డివిజన్ సహకార సంఘ సీఈవోలు, కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలకు ధాన్యం కొనుగోళ్లపై జిల్లా సహకార అధికారి చంద్రమోహన్ అవగాహన కల్పించారు. సమావేశంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ సతీ్‌షరెడ్డి, సీనియర్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌వర్మ, హుస్నాబాద్ సీఈవో సతీష్, మల్లిఖార్జున్, శ్రీధర్, రాజేందర్ పాల్గొన్నారు.