ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2021-08-26T03:51:17+05:30 IST

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్‌, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

 ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌  


బెజ్జంకి, ఆగస్టు 25: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్‌, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో గౌడ సంఘం కమ్యూనిటీ హాల్‌కు, పోతారం గ్రామంలో  పలు అభివృద్ధి పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల, జడ్పీటీసీ కవిత,  ఆయా గ్రామాల్లోని సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-26T03:51:17+05:30 IST