ఘనంగా పీఎంఆర్‌ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2021-12-15T05:30:00+05:30 IST

ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు, సదాశివపేట 12వ వార్డు కౌన్సిలర్‌ పులిమామిడి రాజు జన్మదిన వేడుకలను బుధవారం సదాశివపేట పట్టణం, మండలం, సంగారెడ్డి పట్టణంలో ప్రజలు, అభిమానులు, పీఎంఆర్‌ యువసేన కార్యకర్తలు, సంగారెడ్డి, జహీరాబాద్‌, పటాన్‌చెరు, నారాయణఖేడ్‌ నియోజకవర్గాల, జిల్లా ముదిరాజ్‌ సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా పీఎంఆర్‌ జన్మదిన వేడుకలు
సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద ఓ ఫంక్షన్‌హాలులో పులిమామిడి రాజు జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న ముదిరాజ్‌ సంఘం నాయకులు

సదాశివపేట/సంగారెడ్డి టౌన్‌, డిసెంబరు 15 : ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు, సదాశివపేట 12వ వార్డు కౌన్సిలర్‌ పులిమామిడి రాజు జన్మదిన వేడుకలను బుధవారం సదాశివపేట పట్టణం, మండలం, సంగారెడ్డి పట్టణంలో ప్రజలు, అభిమానులు, పీఎంఆర్‌ యువసేన కార్యకర్తలు, సంగారెడ్డి, జహీరాబాద్‌, పటాన్‌చెరు, నారాయణఖేడ్‌ నియోజకవర్గాల, జిల్లా ముదిరాజ్‌ సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. పులిమామిడి రాజు జన్మదిన సందర్భంగా పలు ఆలయాల్లో ఆయన అభిమానులు తీర్థ ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం అనాధాశ్రమాల్లో పిల్లలకు, వృద్ధులకు అవసరమైన సామగ్రి అందజేసి అన్నదానం నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రిల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు, పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్‌ సంఘం జిల్లా బాధ్యులు బలిజగూడెం నాగేష్‌, బోయిని సుధాకర్‌, సుమంగళి చంద్రశేఖర్‌, తుర్కపల్లి శ్రీనివాస్‌, డీసీసీబీ డైరెక్టర్‌ రమేశ్‌, ఓతే చంద్రశేఖర్‌, చర్లగూడెం ఉపసర్పంచ్‌ మాణిక్యం, బారక రవి, ముదిరాజ్‌ సంఘం సదాశివవేట పట్టణ అధ్యక్షుడు గారెల తుల్రాఆం, చాపల హనుమంతు, నల్ల మల్కయ్య, బంటు రవి, బల్లెం సతీష్‌, సురేష్‌, అల్లుడు శ్రీనివాస్‌, రాగం అనిల్‌, వర్కల గుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-15T05:30:00+05:30 IST