వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు ప్రమోషన్‌

ABN , First Publish Date - 2021-02-09T04:55:51+05:30 IST

జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు పదోన్నతులు లభించాయి.

వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు ప్రమోషన్‌

సంగారెడ్డి అర్బన్‌, ఫిబ్రవరి 8: జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు పదోన్నతులు లభించాయి. డీఎంహెచ్‌వో కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ ఎం.నర్సింహులు పదోన్నతిపై మెదక్‌ డీఎంహెచ్‌వో కార్యాలయ సూపరింటెండెంట్‌గా బదిలీ అయ్యారు. ఎల్‌డీ కంప్యూటర్‌గా విధులు నిర్వహిస్తున్న విజయ్‌కుమార్‌, రమాదేవి అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. విజయ్‌కుమార్‌ నీలోఫర్‌ ఆస్పత్రికి, రమాదేవి ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. జిల్లాలోని పలు పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న ముగ్గురు ఏఎన్‌ఎంలను సూపర్‌వైజర్లుగా పదోన్నతిపై జిల్లాలో నియమించారు. మరో 12 మంది ఏఎన్‌ఎంలు వివిధ జిల్లాలకు సూపర్‌వైజర్లుగా పదోన్నతిపై బదిలీ అయ్యారు. వివిధ పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న 12 మంది ఎంపీహెచ్‌ఈవోలు పదోన్నతిపై సీహెచ్‌వోలుగా జిల్లాలకు వెళ్లారు. 

Updated Date - 2021-02-09T04:55:51+05:30 IST