ఫంక్షన్‌హాళ్లలో ప్లాస్టిక్ నిషేధం
ABN , First Publish Date - 2021-08-26T03:50:05+05:30 IST
ప్లాస్టిక్ రహిత పట్టణంగా సిద్దిపేటను మార్చుకునేందుకు ఫంక్షన్‌హాళ్లలో ఫ్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని మున్సిపల్ కమిషనర్ రమణాచారి ఫంక్షన్‌హాళ్ల యాజమానులకు సూచించారు.

సిద్దిపేట సిటీ, ఆగస్టు 25: ప్లాస్టిక్ రహిత పట్టణంగా సిద్దిపేటను మార్చుకునేందుకు ఫంక్షన్‌హాళ్లలో ఫ్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని మున్సిపల్ కమిషనర్ రమణాచారి ఫంక్షన్‌హాళ్ల యాజమానులకు సూచించారు. బుధవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఫంక్షన్‌హాల్ యాజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో 34 స్టీల్ బ్యాంక్‌లను ఏర్పాటు చేశామని, ఫంక్షన్‌లకు వాటిని వినియోగించుకోవాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు పాటించకుంటే రూ.5,000 నుంచి 25,000 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.