ఘనంగా ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన
ABN , First Publish Date - 2021-07-08T05:41:00+05:30 IST
మండల పరిధిలోని దర్పల్లి గ్రామంలోని పురాతన శివాలయంలో హనుమాన్ ధ్వజస్తంభం పునః ప్రతిష్ఠాపన ఉత్సవం ఘనంగా జరిగింది.

చిన్నశంకరంపేట, జూలై 7: మండల పరిధిలోని దర్పల్లి గ్రామంలోని పురాతన శివాలయంలో హనుమాన్ ధ్వజస్తంభం పునః ప్రతిష్ఠాపన ఉత్సవం ఘనంగా జరిగింది. బుధవారం జరిగిన మహోత్సవాల్లో ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్సీ శేరి శుభా్‌షరెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, కరీంనగర్ పోలీస్ అధికారి కమలహసన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ధ్వజస్తంభాన్ని తొగుట పీఠాధిపతి మాధవానంద స్వామి ప్రత్యే పూజలు నిర్వహించి ప్రతిష్ఠించారు. అనంతరం ఎమ్మెల్యే పద్మారెడ్డి, ఎమ్మెల్సీ సుభా్‌షరెడ్డి, పోలీస్ కమిషనర్ కమలహసన్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా తొగుట పీఠాధిపతి భక్తులనుద్ధేశించి అనుగ్రహభాషణం చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.