పొల్యూషన్‌ చెకప్‌ వాహనం, కారు ఢీ: ముగ్గురికి గాయాలు

ABN , First Publish Date - 2022-01-01T04:24:40+05:30 IST

రోడ్డు పక్కన ఆగి ఉన్న పొల్యూషన్‌ చెకప్‌ వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి

పొల్యూషన్‌ చెకప్‌ వాహనం, కారు ఢీ: ముగ్గురికి గాయాలు

 తూప్రాన్‌రూరల్‌, డిసెంబరు 31: రోడ్డు పక్కన ఆగి ఉన్న పొల్యూషన్‌ చెకప్‌ వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తూప్రాన్‌ మండలంలోని ఇస్లాంపూర్‌ శివారులో శుక్రవారం సాయంత్రం హైవే పక్కన ఆగిఉన్న పొల్యూషన్‌ చెకప్‌ వ్యానును కామారెడ్డి వైపు వెళ్తున్న ఆల్టో కారు  ఢీకొన్నది. ఈ ప్రమాదంలో వ్యాను సమీంలో ఉన్న నార్సింగికి చెందిన వెంకట్‌రెడ్డి, తాతపాపన్‌పల్లికి చెందిన నాగేశ్‌లతో పాటు కారులో ఉన్న కామారెడ్డి వైద్యుడు రమణకు తీవ్ర గాయాలయ్యాయి. తాగిన మత్తులో వైద్యుడు కారు నడపడంతోనే ఈప్రమాదం జరిగినట్లు తూప్రాన్‌ పోలీసులు తెలిపారు. క్షతగాత్రులు ముగ్గురిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో పొల్యూషన్‌ చెకప్‌ వ్యాను బాగా దెబ్బ తిన్నట్టు తెలిపారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-01-01T04:24:40+05:30 IST