ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2021-06-22T05:04:23+05:30 IST

ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. చేర్యాల బ్లూకోల్ట్స్‌ సిబ్బంది అడ్డుకుని ప్రాణాలు రక్షించారు.

ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు
వివాహితను రక్షించిన బ్లూకోల్ట్స్‌ సిబ్బంది

చేర్యాల, జూన్‌ 21 : ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. చేర్యాల బ్లూకోల్ట్స్‌ సిబ్బంది అడ్డుకుని ప్రాణాలు రక్షించారు. స్థానిక పెద్దమ్మగడ్డ కాలనీకి చెందిన నవనీత ఓ పాఠశాలలో ఉద్యోగం చేస్తున్నది. భార్యాభర్తలకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం కూడా గొడవ జరగడంతో నవనీత తల్లిదండ్రులకు తెలిపి చనిపోతానని పెద్దచెరువు వద్దకు వెళ్లింది. తమ కూతురు లేనిది తాము కూడా ఉండలేమని వారు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. బ్లూకోల్ట్స్‌ సిబ్బంది భాస్కర్‌, కిష్టయ్య అక్కడికి చేరుకుని చెరువులో దూకిన నవనీతను రక్షించారు. ఆమెతో పాటు తల్లిదండ్రులను పోలీ్‌సస్టేషన్‌కు తీసుకురాగా, ఎస్‌ఐ రాకేష్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించారు. భర్తను పిలిపించి సమస్య పరిష్కరిస్తామని హామీఇచ్చారు. 

Updated Date - 2021-06-22T05:04:23+05:30 IST