గొర్రెల దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

ABN , First Publish Date - 2021-10-08T04:55:57+05:30 IST

మండలంలోని పలు గ్రామాల్లో గొర్రెలు, మేకల దొంగతాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు దుబ్బాక సీఐ శ్రీనివా్‌సరెడ్డి గురువారం తెలిపారు.

గొర్రెల దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

 దుబ్బాక, అక్టోబరు 7: మండలంలోని పలు గ్రామాల్లో గొర్రెలు, మేకల దొంగతాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు దుబ్బాక సీఐ శ్రీనివా్‌సరెడ్డి గురువారం తెలిపారు. మండలంలోని శిలాజీనగర్‌, రామక్కపేట, అచ్చుమాయిపల్లి, ఆరెపల్లి, పద్మనాభునిపల్లి గ్రామాల్లో గొర్రెలు, మేకల అపహరణపై ఇటీవల ఫిర్యాదులొచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గురువారం దుబ్బాక టీటీడీ కల్యాన మండపం వద్ద వాహనాల తనీఖీ చేస్తుండగా మండలంలోని గోసాన్‌పల్లి గ్రామానికి చెందిన కరుణాకర్‌, తొగుట మండలం వెంకటరావుపేటకు చెందిన నాగరాజు జీవాలకు తాళ్లు కట్టి తీసుకెళ్తుండగా విచారించారు. మండలంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్టు ఒప్పుకున్నారు. వారితో పాటు వచ్చిన మరో ఇద్దరు స్వామి, భూమేష్‌ పోలీసులను చూసి బైక్‌ను అక్కడే విడిచిపట్టి పరారయ్యారన్నారు. పట్టుబడిన ఇద్దరి నుంచి రూ.79వేలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు వెల్లడించారు. సీఐ వెంట ఎస్‌ఐ స్వామి, పీఎ్‌సఐ సురేష్‌, కానిస్టేబుళ్లు రాజిరెడ్డి, శ్రీనివాస్‌ ఉన్నారు.


 

Updated Date - 2021-10-08T04:55:57+05:30 IST