మెదక్‌ కోర్టులో పోక్సో ప్రత్యేక న్యాయస్థానం

ABN , First Publish Date - 2021-07-12T05:43:10+05:30 IST

బాలలపై జరుగుతున్న లైంగిక దాడులకు సంబంధించి నమోదవుతున్న కేసులను విచారించేందుకు గాను ఆదివారం మెదక్‌ జిల్లా న్యాయస్థాన సముదాయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోక్సో కోర్టును హైకోర్టు జస్టిస్‌, ఉమ్మడి జిల్లా పరిపాలన జడ్జి, జస్టిస్‌ టి. అమర్‌నాథ్‌గౌడ్‌ ప్రారంభించారు.

మెదక్‌ కోర్టులో పోక్సో ప్రత్యేక న్యాయస్థానం
కోర్టు ఆవరణలో మొక్కను నాటి నీళ్లు పోస్తున్న హైకోర్టు జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌

ప్రారంభించిన హైకోర్టు జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌

మెదక్‌ అర్బన్‌, జూలై 11: బాలలపై జరుగుతున్న లైంగిక దాడులకు సంబంధించి నమోదవుతున్న కేసులను విచారించేందుకు గాను ఆదివారం మెదక్‌ జిల్లా న్యాయస్థాన సముదాయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోక్సో కోర్టును హైకోర్టు జస్టిస్‌, ఉమ్మడి జిల్లా పరిపాలన జడ్జి, జస్టిస్‌ టి. అమర్‌నాథ్‌గౌడ్‌ ప్రారంభించారు. జస్టిస్‌ అమర్‌ నాథ్‌ గౌడ్‌ సమక్షంలో పోక్సో కోర్టు జడ్జి మైత్రేయి బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఉమ్మడి జిల్లా న్యాయమూర్తి పాపిరెడ్డితో కలిసి పోక్సో కోర్టుకు సంబంధించిన సెక్షన్‌, గెస్ట్‌ రూమ్‌లను ఆయన ప్రారంభించారు. బార్‌ అసోసియేషన్‌ హాల్‌ల్లో మెదక్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శి చంద్రారెడ్డి, సంతో్‌షరెడ్డి జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ను ఘనంగా సన్మానించారు. అంతకుముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీరించగా.. పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కోర్టు ఆవరణలో జామ మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి మాట్లాడుతూ బాధిత చిన్నారులకు సత్వర న్యాయం అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ హరీశ్‌, ఎస్పీ చందనదీప్తి, జిల్లాలోని న్యాయమూర్తులు, మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట, నర్సాపూర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు చంద్రారెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి, రవీందర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి సంతో్‌షరెడ్డి, జీపీ రామశర్మ, న్యాయవాదులు పోచయ్య, జనార్దన్‌రెడ్డి, ఫజల్‌, ప్రతా్‌పరెడ్డి, రవీందర్‌, బాలయ్య, వెంకటేశం, సుభా్‌షగౌడ్‌, రాఘవులు, జీవన్‌, రాము, అశ్విన్‌, వినోద్‌కుమార్‌, శ్రీనివాస్‌, సురేష్‌, శ్రీపతిరావు తదితరులు పాల్గొన్నారు. 




Updated Date - 2021-07-12T05:43:10+05:30 IST