సమస్యలు పరిష్కరించలేని సమావేశాలెందుకు?

ABN , First Publish Date - 2021-12-30T20:03:16+05:30 IST

మూడునెలల క్రితం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చినా ఇప్పటివరకు పరిష్కరించకపోవడంతో ఆయా గ్రామాల సర్పంచులు సమావేశాన్ని బహిష్కరించారు.

సమస్యలు పరిష్కరించలేని సమావేశాలెందుకు?

సమావేశాన్ని బహిష్కరించిన సర్పంచులు

రాయికోడ్‌, డిసెంబరు 29 : మూడునెలల క్రితం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చినా ఇప్పటివరకు పరిష్కరించకపోవడంతో ఆయా గ్రామాల సర్పంచులు సమావేశాన్ని బహిష్కరించారు. బుధవారం రాయికోడ్‌లోని ఎంపీపీ సమావేశ మందిరంలో ఎంపీపీ మమతాఅశోక్‌ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ఉండగా, అధికారులు ఎంపీటీసీలు రాకపోవడంతో 3 గంటల తర్వాత ప్రారంభమైంది. అయితే గత సమావేశంలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే సమావేశం కొనసాగించాలని సర్పంచులు పట్టుబట్టారు.

సమస్యలు పరిష్కరించని సమావేశాలు ఎందుకని మండిపడ్డారు. సమావేశానికి హాజరుకాని అధికారులపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మల్లికార్జున్‌పాటిల్‌, ఎంపీటీసీలు పండరి, మొగులప్ప, వీణారాణి, సర్పంచులు సంగమేశ్వర్‌పాటిల్‌, సంతో్‌షకుమార్‌, కృష్ణ, ప్రవీణ్‌, బస్వరాజ్‌, హన్మంతు, నాగార్జున, విఠల్‌రెడ్డి, తహసీల్దార్‌ రాజమల్లయ్య, ఎంపీడీవో వెంకటేశం, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-30T20:03:16+05:30 IST