గ్రామాల్లో ముగిసిన పీర్ల ఊరేగింపు

ABN , First Publish Date - 2021-08-21T04:56:59+05:30 IST

మద్దూరు, దూళిమిట్ట మండలాల్లో పీర్ల ఊరేగింపు శుక్రవారంతో ముగిసింది. తొమ్మిది రోజుల పాటు గ్రామగ్రామాన పీర్లను ఊరేగించారు.

గ్రామాల్లో ముగిసిన పీర్ల ఊరేగింపు
చిన్నకోడూరు మండలం ఓబులాపూర్‌లో పీర్ల ఊరేగింపు

మద్దూరు, ఆగస్టు 20: మద్దూరు, దూళిమిట్ట మండలాల్లో పీర్ల ఊరేగింపు శుక్రవారంతో ముగిసింది. తొమ్మిది రోజుల పాటు గ్రామగ్రామాన పీర్లను ఊరేగించారు. భక్తులు కుడుకపేర్లు, నోట్ల దండలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. జాలపల్లిలో జడ్పీటీసీ గిరి కొండల్‌రెడ్డి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో నజీర్‌, రజాక్‌, మాజీ ఉపసర్పంచ్‌ కనకయ్య, బందారం రమేష్‌, రాజు, యాదగిరి పాల్గొన్నారు. 

గజ్వేల్‌టౌన్‌: మండలంలోని జాలిగామ గ్రామంలో మూడు మజీదులలో నెలకొల్పిన పీర్లను శుక్రవారం సాయంత్రం గ్రామ చెరువులో నిమజ్జనం చేశారు. 

కొండపాక: మండలంలోని మర్పడగ, సిర్సనగండ్ల, కుకునూరుపల్లి గ్రామాల్లో పీర్లను నిమజ్జనం చేశారు.

చిన్నకోడూరు: మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో పీర్లను నిమజ్జనం చేశారు.


 

Updated Date - 2021-08-21T04:56:59+05:30 IST