టీఆర్‌ఎఎస్ పథకాలకు ఆకర్షితులవుతున్న ప్రజలు
ABN , First Publish Date - 2021-05-06T05:13:47+05:30 IST
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
నారాయణఖేడ్/పెద్దశంకరంపేట, మే 5: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పెద్దశంకరంపేట సర్పంచ్ సత్యనారాయణ, ఉపసర్పంచ్ దశరత్, పెద్దశంకరంపేట మండ లం కొత్తపేట సర్పంచ్ అనంతరావు, గోపని వెంకటాపూర్ సర్పంచ్ రవీందర్, ఉప సర్పంచ్ మల్లమ్మతో పాటు ఆయా పంచాయతీలకు సంబంధించిన పలువురు వార్డు సభ్యులు, మాజీ సభ్యులు తమ అనుచరులతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. దీంతో ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, పార్టీ మండలాధ్యక్షుడు మురళి పంతులు, నాయకులు నారాయణ తదితరులు పాల్గొన్నారు.
రైతు బీమా చెక్కు అందజేత
నారాయణఖేడ్: మండలంలోని ర్యాకల్‌కు చెందిన విజయలక్ష్మికి రైతుబీమా పథకం ద్వారా మంజూరైన రూ.5 లక్షల ఆర్థిక సహాయం చెక్కును బుధవారం ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో అందజేశారు. విజయలక్ష్మి భర్త గోపాల్‌రెడ్డి ఇటీవల మృతి చెందగా, రైతుబీమా ద్వారా బీమాకు సంబంధించి ఆర్థిక సహాయం మంజూరు కావడంతో ఆయన ఆమెకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.