పాపన్న జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి
ABN , First Publish Date - 2021-08-04T03:46:32+05:30 IST
ఈనెల 2నుంచి 18వ వరకు నిర్వహించనున్న సర్దార్ సర్వాయి పాపన్న 371వ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని కల్లుగీత కార్మికసంఘం జిల్లా కార్యదర్శి అరుణ్‌కుమార్ పిలుపునిచ్చారు.

చేర్యాల, ఆగస్టు 3: ఈనెల 2నుంచి 18వ వరకు నిర్వహించనున్న సర్దార్ సర్వాయి పాపన్న 371వ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని కల్లుగీత కార్మికసంఘం జిల్లా కార్యదర్శి అరుణ్‌కుమార్ పిలుపునిచ్చారు. చేర్యాల మండలం వీరన్నపేట గ్రామంలో మంగళవారం కల్లుగీత కార్మికోద్యమ యోధుల యాదిసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్లుగీత కార్మికోద్యమంలో అమరులైన యోధుల ఆశయసాధనకు పాటుపడాలని అన్నారు. ప్రభుత్వం కార్మికుల ఉపాధి కల్పనకు కల్లుగీత వృత్తిని ఆధునీకరించే చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు మెరిండ్ల శ్రీనివాస్, గ్రామ అధ్యక్షుడు బొందుగుల కిష్టయ్య, ఆరెల్ల శ్రీనివాస్, కీసరి నర్సింహులు, బలరాం, ప్రవీణ్, రాజు, విష్ణు, నర్సయ్య, వీరమల్లయ్య, రాజు పాల్గొన్నారు.