కన్నుల పండుగగా పెద్దమ్మ పెద్ది రాజుల కల్యాణం

ABN , First Publish Date - 2021-12-26T06:13:41+05:30 IST

కొండపాక మండలం బందారం గ్రామంలో ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో కొలువుదీరిన పెద్దమ్మతల్లి దేవాలయ పంచమ వార్షికోత్సవాలు గత మూడు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

కన్నుల పండుగగా పెద్దమ్మ పెద్ది రాజుల కల్యాణం
పెద్దమ్మ పెద్ద రాజుల కల్యాణ మహోత్సవం

కొండపాక, డిసెంబరు 25: కొండపాక మండలం బందారం గ్రామంలో ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో కొలువుదీరిన పెద్దమ్మతల్లి దేవాలయ పంచమ వార్షికోత్సవాలు గత మూడు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం లోకకల్యాణార్థం  పెద్దమ్మతల్లి పెద్దిరాజుల  కళ్యాణ మహోత్సవం వేదమంత్రాల నడుమ  ముత్యాల పందిరిలో వైదిక నిర్వాహకులు అప్పాల భావానంద శర్మ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. కళ్యాణ మహోత్సవానికి బందారం గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నప్రసాద  కార్యక్రమం నిర్వహించారు. పెద్దమ్మ తల్లికి భక్తులు ఓడి బియ్యం కానుకలు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ రాగళ్ల సుగుణ హాజరయ్యారు.  ఈ కార్యక్రమంలో ముదిరాజ్‌ కుల సంఘం సభ్యులు నాయకులు తదితరులు ఉన్నారు 

Updated Date - 2021-12-26T06:13:41+05:30 IST