తెలంగాణ సాయుధ పోరాటయోధుడు కేవల్‌ కిషన్‌

ABN , First Publish Date - 2021-12-27T04:41:59+05:30 IST

తెలంగాణ సాయుధ పోరాటయోధుడు కేవల్‌ కిషన్‌ అని సీపీఐ జిల్లా కార్యదర్శి జలాలొద్దీన్‌ అన్నారు.

తెలంగాణ సాయుధ పోరాటయోధుడు కేవల్‌ కిషన్‌
చేగుంట మండలం పొలంపల్లి శివారులో కేవల్‌ కిషన్‌ సమాధి వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీ బండ ప్రకాష్‌

సంగారెడ్డి రూరల్‌, డిసెంబరు 26 : తెలంగాణ సాయుధ పోరాటయోధుడు కేవల్‌ కిషన్‌ అని సీపీఐ జిల్లా కార్యదర్శి జలాలొద్దీన్‌ అన్నారు. సీపీఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం సంగారెడ్డి పట్టణంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో కేవల్‌ కిషన్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవల్‌ కిషన్‌ సీపీఐ నుంచి మెదక్‌ ఎమ్మెల్యేగా గెలుపొంది అనేకమంది పేదలకు ఇళ్ల స్థలాలు పంచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆనంద్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు వజీర్‌బేగ్‌, నర్సింహులు, రుబీనాబేగం, నరేందర్‌రెడ్డి, మహబూబ్‌ఖాన్‌, నర్సింహులు, అశోక్‌, శ్రీనివాస్‌, మల్లేశం, ప్రభాకర్‌, మంగళ పాల్గొన్నారు. భూ స్వాములకు వ్యతిరేకంగా కేవల్‌ కిషన్‌ ప్రజాపోరాటం నిర్వహించారని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్‌ అన్నారు. సంగారెడ్డిలోని కేకే భవన్‌లో నిర్వహించిన కేవల్‌ కిషన్‌ వర్ధంతిలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లేశం, జి.సాయిలు, లక్ష్మి, యాదవరెడ్డి, కృష్ణ, బాల్‌రాజ్‌, సురేష్‌, గంగారం పాల్గొన్నారు.

జహీరాబాద్‌: జహీరాబాద్‌ పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో కేవల్‌ కిషన్‌ 61వ వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడారు. కేవల్‌ కిషన్‌ ఆశయసాధనకు సీపీఎం కృషి చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు మూర్తి, సలీమోద్దీన్‌, మసియోద్దీన్‌, అతీక్‌, తదితరులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న నిరంకుశ పాలన, ప్రజావ్యతిరేక విధానాలకు ప్రజలు చరమగీతం పాడాలని సీపీఐ డివిజన్‌ కార్యదర్శి కె.నర్సింహులు అన్నారు. ఆదివారం జహీరాబాద్‌ పట్టణంలోని సీపీఐ డివిజన్‌ కార్యాలయం వద్ద 97వ సీపీఐ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ డివిజన్‌ సహాయ కార్యదర్శి అజారోద్దీన్‌, నాయకులు అశ్వక్‌ హుస్సేన్‌, మండల కార్యదర్శి తాజొద్దీన్‌, శంకర్‌, సాయికుమార్‌, అనిల్‌యాదవ్‌, యూనుస్‌, అసద్‌ తదితరులు పాల్గొన్నారు. 

మెదక్‌ జిల్లాలో

చేగుంట, డిసెంబరు 26 : కేవల్‌ కిషన్‌ వర్ధంతిని తెలంగాణ పండుగగా నిర్వహిస్తామని ఎమ్మెల్సీ బండ ప్రకాష్‌ తెలిపారు. చేగుంట మండలం పొలంపల్లి శివారులోని కిషన్‌ సమాధిని దర్శించుకుని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్‌ సంఘ నాయకులు పాల్గొన్నారు. అలాగే పొలంపల్లి శివారులోని కేవల్‌ కిషన్‌ సమాధి వద్ద ఆయన కూతురు వీణ కుటుంబసభ్యులు, సీపీఎం కార్యదర్శి మల్లేశం, వివిధ సంఘాల నాయకులు నివాళులర్పించారు. 

మెదక్‌ అర్బన్‌: పేదల సంక్షేమం కోసం పరితపించిన పోరాటయోధుడు కేవల్‌ కిషన్‌ అని మెదక్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బట్టి జగపతి అన్నారు. కేవల్‌ కిషన్‌ 61వ వర్ధంతి సందర్భంగా ఆదివారం గాంధీనగర్‌లో ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. యాచం సిద్ధిరాములు, ఆకుల ఏసయ్య, మహమూద్‌, ఖాసీం పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-27T04:41:59+05:30 IST