బైక్‌తో లారీని ఢీకొని ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-02-07T05:27:31+05:30 IST

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన సంగారెడ్డి పట్టణం కొత్త బస్టాండ్‌ సమీపంలో గోకుల్‌ ప్రైవేట్‌ ఆస్పత్రి వద్ద శనివారం తెల్లవారుజామున జరిగింది.

బైక్‌తో లారీని ఢీకొని ఒకరి మృతి
ఘటనా స్థలంలో క్షతగాత్రులు

సంగారెడ్డి క్రైం, ఫిబ్రవరి 6 : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన సంగారెడ్డి పట్టణం కొత్త బస్టాండ్‌ సమీపంలో గోకుల్‌ ప్రైవేట్‌ ఆస్పత్రి వద్ద శనివారం తెల్లవారుజామున జరిగింది. ఎస్‌ఐ పి.ప్రసాద్‌ వివరాల ప్రకారం సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన బేగరి ప్రేమ్‌రాజ్‌ (30) అతని స్నేహితులు సాయికుమార్‌ (28), విష్ణుసంతోష్‌ (29) కలిసి బైక్‌పై సంగారెడ్డి పాత బస్టాండ్‌ నుంచి పోతిరెడ్డిపల్లి వైపు వెళ్తున్నారు. గోకుల్‌ ప్రైవేట్‌ ఆస్పత్రి వద్ద రోడ్డు పక్కన నిలిపిన ఏపీ 12 వీ 3418 నంబరు గల లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ప్రేమ్‌రాజ్‌ (30) అక్కడికక్కడే మృతిచెందగా.. సాయికుమార్‌, విష్ణుసంతోష్‌ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వీరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-02-07T05:27:31+05:30 IST