చెట్టుకు బైకు ఢీకొని ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-10-07T05:30:00+05:30 IST

నర్సాపూర్‌ మండలం మూసాపేట గ్రామ సమీపంలో పెద్దచింతకుంటకు చెందిన గోపాల్‌(37) బైక్‌తో చెట్టును ఢీకొని మృతి చెందాడు.

చెట్టుకు  బైకు ఢీకొని ఒకరి మృతి

తూప్రాన్‌రూరల్‌, అక్టోబరు 7: మండలపరిధిలోని ఘనపూర్‌ శివారులో గజ్వేల్‌ రోడ్డుపై బుధవారం రాత్రి బైక్‌తో చెట్టుతో ఢీకొన్న ప్రమాదంలో పోతరాజుపల్లి గీతారెడ్డికాలనీ నివాసి మహ్మద్‌ అక్బర్‌పాషా(40) అక్కడికక్కడే మృతిచెందగా అలీబాబాకు తీవ్రగాయాలయినట్లు తూప్రాన్‌ ఎస్‌.ఐ సురేశ్‌కుమార్‌ తెలిపారు. ఇద్దరుకలిసి రాత్రి 10.30 గంటలసమయంలో బైకుపై నాచారంవైపునకు వెళ్తుండగా ఘనపూర్‌ శివారులో బైకు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్‌ఐ చెప్పారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌.ఐ పేర్కొన్నారు.


మూసాపేట వద్ద మరో వ్యక్తి..

నర్సాపూర్‌, అక్టోబరు 7: నర్సాపూర్‌ మండలం మూసాపేట గ్రామ సమీపంలో పెద్దచింతకుంటకు చెందిన గోపాల్‌(37) బైక్‌తో చెట్టును ఢీకొని మృతి చెందాడు. ఎస్‌ఐ గంగరాజు గురువారం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాల్‌ బైక్‌పై బుధవారం రాత్రి మూసాపేట వైపు నుంచి పెద్దచింతకుంటకు బయలుదేరాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం తెల్లవారుజామున అటువైపు వెళ్లినవారు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని నర్సాపూర్‌ ఆసుపత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా అంతకు ముందు కొందరు స్నేహితులతో కలిసి మద్యం సేవించాడని, వారిని కూడా విచారించాలని మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 

Updated Date - 2021-10-07T05:30:00+05:30 IST