గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-10-07T05:30:00+05:30 IST

మాసాయిపేట మండల కేంద్రం సమీపంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్రగాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి

వెల్దుర్తి, అక్టోబరు 7: మాసాయిపేట మండల కేంద్రం సమీపంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్రగాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.  చేగుంట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి కామారెడ్డి- హైదరాబాద్‌ రోడ్డుపై బంగారమ్మ ఆలయం వద్ద నడుచుకుంటూ వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తిని  ఓ వాహనం ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని  హైదరాబాద్‌ లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే సెల్‌ నంబర్లు 949061705, 9490617018కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.  

Updated Date - 2021-10-07T05:30:00+05:30 IST