ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-03-22T05:33:40+05:30 IST

ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం రామాయంపేటలో చోటు చేసుకుంది.

ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి
మృతి చెందిన నర్సింహులు

రామాయంపేట, మార్చి 21: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో  ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం రామాయంపేటలో చోటు చేసుకుంది. మండలంలోని లక్ష్మాపూర్‌కు చెందిన కాసుల నర్సింహులు(40) తన బైక్‌పై కామారెడ్డివైపు వెళ్తుండగా రామాయంపేట వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో నర్సింహులు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ రాజేష్‌ ఘటనాస్థలికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కామారెడ్డి డిపో బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 
Updated Date - 2021-03-22T05:33:40+05:30 IST